Header Banner

5000 మందితో సూర్య నమస్కారాలు కార్యక్రమం! పాల్గొన్న కేంద్ర మంత్రి! ఎక్కడంటే?

  Mon Feb 03, 2025 08:13        India

శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి యొక్క రథసప్తమి పండుగను పురస్కరించుకొని.. శ్రీకాకుళం మిల్లు జంక్షన్‌లోని 80 ఫీట్ రోడ్డులో సుమారుగా 5000 మంది భక్తులు, విద్యార్థులతో సూర్య నమస్కారాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆయుష్ విభాగం వారి ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని సూర్య నమస్కారాలు కార్యక్రమం 80 ఫీట్ రోడ్ నందు జరిగింది. ఈ కార్యక్రమం శ్రీకాకుళం ఆయుష్ అధికారి డాక్టర్ జగదీష్ గారు, జిల్లా యోగ సంఘం రామారావు గారి అధ్యక్షత ఆధ్వర్యంలో సుమారుగా 5000 మంది భక్తులు, విద్యార్థుల సహకారంతో సూర్య నమస్కారాలు యొక్క కార్యక్రమం జరిగింది.

 

శ్రీకాకుళం మిల్ జంక్షన్ దగ్గర ఉన్న 80 ఫీటు రోడ్డు.. మొదలుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న వాంబే కాలనీ వరకు కిలోమీటరున్నర పొడవు ఉండే ఈ రోడ్డు పైన 5000 మంది వాలంటీర్లు మరియు 150 మంది యోగా శిక్షకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన నాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గోండు శంకర్.. ఈ సూర్య నమస్కారాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

సమస్త జీవరాశులకు వెలుగు అందించే.. సూర్యుడు మనకి ఆరోగ్య ప్రధాతగా పురాణాలు చెబుతున్నాయి. అటువంటి ఆరోగ్య ప్రధాతకు 12 సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ దోషాలు అనేవి పోయి మానవ శరీరం అనేది ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయపడుతుందని జిల్లా యోగ అధ్యక్షులు ఎమ్. వి. రామారావు గారు లోకల్18కు వివరించారు. సూర్య నమస్కారం అనేది యోగా యొక్క చాలా ముఖ్యమైన రూపం, ఇది ఆరోగ్యకరమైన శరీరం, మనస్సు మరియు ఆత్మను పొందేందుకు ఉపయోగపడుతుంది.

 

అదేవిధంగా ఇది మానవాళికి తెలిసిన వ్యాయామం యొక్క అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటిగా కూడా పిలువబడుతుంది. సూర్య నమస్కారాలు మీ శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉంచడంలో సహాయపడతాయి. అదే సమయంలో, యోగ మనస్సు, ఆత్మకు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. సూర్యనమస్కారాలను నిరంతరం చేయడం ద్వారా, అది మీ ఎముకలు, కండరాల బలాన్ని పెంచి.. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్, యాంగ్జయిటీ, ఇతర మానసిక వ్యాధులతో బాధపడేవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వారికి మెరుగ్గా, మరింత శక్తివంతంగా అనిపించడంలో సహాయపడుతుంది. అందుకే రోజూ సూర్య నమస్కారం చేయాలి. ఇది ఖచ్చితంగా ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి సహాయ పడుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP